చదువులు సంస్కారానికీ, పదవులు పరోపకారానికీ భూమికలని మనసార నమ్మి, నోరార చెప్పి, చేయార చేసి చూపిన విచక్షుణులు మునసబుగారు. వీరి అసాధారణ వ్యక్తిత్వం అజేయం,జగజ్జేయం. ఆయన అచ్చంగా కార్యశూరులేగాని, వాచా శూరులుగారు. పదవీప్రలోభాలకీ, ప్రజారంగ ప్రలాభాలకీ అతీతులు, అధికార దాహాలకీ, అవకాశవాద వ్యామోహాలకీ అనాసక్తులు. నూటికి నూరుపాళ్ళూ కార్యవాది. వెరసి: మునసబుగారు మంచికి మారుపేరు; మన్ననకి మరోపేరు...
No comments:
Post a Comment